calender_icon.png 22 October, 2024 | 9:58 PM

యాక్షన్ చెప్పగానే చనిపోవాలి

19-10-2024 12:00:00 AM

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. సినీ రంగానికి షారుఖ్ చేస్తున్న సేవలకుగానూ.. ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ’లో జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఈ పురస్కారం అందుకునేందుకు ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోరికను బయట పెట్టారు. జీవితాంతం నటుడిగానే కొనసాగుతారా? అన్న ప్రశ్నకు సమాధానంగా షారు ఖ్ మాట్లాడుతూ.. “చనిపోయే వరకూ సినిమాల్లోనే ఉంటా.

ఏదైనా సినిమా సెట్‌లో యాక్షన్ చెప్పగానే చనిపోయి, కట్ చెప్పాక లేవకూడదు. ఇదే నా చివరి కోరిక” అని షారుఖ్ పేర్కొన్నారు. తాను స్టార్‌డమ్‌కు పెద్దగా ప్రాధాన్యమివ్వనని.. గౌరవిస్తానన్నారు. దానికి కారణం స్టార్‌డమ్ కారణంగా తనకు ప్రేమాభిమానాలు, గుర్తింపు, డబ్బు లభించడమేనన్నారు. స్టార్ హోదా కారణంగా తన కుటుంబం కూడా సంతోషంగా ఉందన్నారు.  ప్రస్తుతం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో వస్తున్న ‘కింగ్’ చిత్రంలో షారుఖ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.