calender_icon.png 31 March, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేటీ బచావో బేటీ పడావో అమలుకు కార్యాచరణ రూపొందించాలి

20-03-2025 02:01:53 AM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం అసిఫాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): వచ్చే ఆర్థిక సంవత్సరంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాల అమలుపై కార్యచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భేటీ బచావో - బేటి పడావో కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భేటీ బచావో బేటి బడవు కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు కార్యచరణ రూపొందిం చాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో బాలసభలు నిర్వహించాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలలో బాలికల విద్య ప్రాముఖ్యత తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

విద్యార్థినులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించాలని, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బాలికల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, రక్తహీనత, పోషకాహార లోపాలు గల బాలికలను గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించా లని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్, సి డి పి ఓ రేణుక, జిల్లా మహిళా సాధికారత సమన్వయకర్త శారద, సభ్యులు మమత, రాణి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.