ఫిషరీష్ చైర్మన్‌కు వినతి
మంథని, అక్టోబర్ 21 (విజయక్రాం తి): మంథని మండలంలో గత శనివా రం చిన్న సైజ్ నాణ్యత లేని చేప పిల్లల ను పంపిణీ చేసిన అధికారులపై చర్య లు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పోతరవేని క్రాంతి కోరారు. సోమవారం హైదరాబాద్‌లో ని రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యాలయంలో ఫిషరిష్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌కు ఫిర్యా దు చేశారు. అలాగే గత సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న మంథని(కే8) సొసైటీకి సంబంధించిన నూతన సభ్యత్వాలను త్వరగా అందించాలని కోరారు.