ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్
స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బస్సులకు పిట్‌నెస్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కెపాసిటికి మించి పిల్లలను స్కూల్ బస్సుల్లో ఎక్కిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలకు చెందిన బస్సులకు పేర్లు కూడా రాయడం లేదని, ప్రమాదాలు జరిగినప్పుడు స్కూల్ యజమాన్యం మీద చర్యలు తీసుకోకుండా పేద డ్రైవర్ల మీద కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.