calender_icon.png 15 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత పశుగ్రాసానికి కార్యాచరణ రూపొందించాలి

13-11-2024 12:37:13 AM

పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): రాష్ర్టంలోని పశు పెంప కందారులకు ఉచిత పశుగ్రాస విత్తనాల కోసం రాబోయే ఐదేళ్లకు సం బంధించిన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్య సాచి ఘోష్ ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో జిల్లా వెటర్నరీ అధికారులతో సమావేశమై మాట్లాడారు.

రాష్ర్ట విత్తనాభివృద్ధి సంస్థ,  ఇతర ప్రైవేట్ సంస్థల ప్రాజెక్టులను పరిశీలించి, అందుకు అనుగు ణంగా నివేదికను సమర్పించాలన్నా రు. గొర్రెలు, మేకలకు సంబంధించిన 67 ప్రాజెక్టులు, 3 పౌల్ట్రీ ప్రాజెక్టులకు రుణాలు అందించడానికి బ్యాంకులు ముందుకొచ్చాయన్నారు. ఇప్పటి వర కు రాష్ర్టంలో 412 ప్రాజెక్టులకు (నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్-ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధి కార్యక్రమం) పథకంలో పశుసంవర్ధక శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింద న్నారు.

రాష్ర్టస్థాయి కమిటీ సూచన మేరకు కేంద్రస్థాయి కమిటీ వాటిని పరిశీలించి ఆమోదించాకే ప్రాజెక్టులను ప్రారంభించాలని సూచించారు. ఆయా పథకాలకే సబ్సిడీ అందేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు సూచిం చారు. ఎన్‌ఎల్‌ఎం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పశుపోషకుల అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో పశుసం వర్ధక శాఖ డైరెక్టర్ గోపి, పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వ హణాధికారి మల్లీశ్వరి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఎండీ డాక్టర్ బి.సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.