calender_icon.png 21 September, 2024 | 12:52 AM

అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

26-07-2024 04:38:04 PM

మంథని: మంథని మున్సిపల్ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ లపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ లకు  జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం  కార్యదర్శి బూడిద గణేష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ.. మంథనిలో శ్రీరామ వాటర్ ప్లాంట్, మధురం వాటర్ ప్లాంట్ తోపాటు 8 వాటర్ ప్లాంట్ లు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రజల  ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా కెమికల్ వాడుతున్నారని, పరిశుభ్రత పాటించకుండా వాటర్ క్యాన్లను శుభ్రం చేయకుండా పాకురు పట్టిన క్యాన్లతో నీటిని సరఫరా చేస్తున్నన్నారు. మంథనిలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని బూడిద గణేష్ అధికారులను కోరారు.