కోదాడ,(విజయక్రాంతి): జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఆప్టికల్ షాప్ లపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోయిళ్ల నవీన్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం బోయిళ్ల నవీన్ మాట్లాడుతూ... పలు షాపుల నిర్వాహకులు పేద, మధ్య తరగతి ప్రజల మీద విపరీతంగా డబ్బులు దండుకుంటున్నారు. అలాగే వారికీ ఎటువంటి అర్హతలు లేకుండా కాళ్ళ కి సంబందించిన టెస్టు లు చేస్తు వేల రూపాయలు కంటి అద్దాల పేరుతో అమాయక ప్రజలా సొమ్ము ను దోచుకుంటున్నారు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ దండ చేస్తున్నారు జిల్లా కేంద్రం తో పాటు కోదాడ హుజుర్నగర్ మరియు తుంగతుర్తి లాంటి నియోజకవర్గ కేంద్రం లో ఈ వ్యపారం నడిపిస్తున్నారు కావున ఇలాంటి వాటిని అధికారం తనిఖీలు చేసి నిబంధన లకి విరుద్ధం గా నడుస్తున ఆప్టికల్ షాప్ లను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలి లేని పక్షం లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో లో జిల్లా వ్యప్తగా ఉద్యమం చేస్తాం ఆని హెచ్చరించారు