మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని చిర్రకుంట గ్రామంలో గల బీరయ్య దేవుని ఆలయం వద్ద ఉన్న హైమాస్ లైట్ లోని బల్బులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ ఆస్తులను దొంగిలించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఈ మేరకు గ్రామస్తులు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... గ్రామంలో రాత్రిపూట వెలుగులు నింపేందుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయగా కొంతమంది హైమాస్ బల్బ్ లను ఎత్తుకెళ్లడంతో గుడి పరిసర ప్రాంతాలు అంధకారంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని గ్రామస్థులు కోరారు.