calender_icon.png 4 March, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి

04-03-2025 12:30:44 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, మార్చి 3 ః తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ  గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఉన్నతాధికారులను కోరారు.

సోమవారం ఉదయం ఆకస్మికంగా పాఠశాలను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల, కళాశాలలో ఉన్న 36 సిబ్బంది ఉదయం 8:15 నిమిషాలకు రావాల్సి  ఉండగా తనిఖీ చేసే సమయంలో కేవలం 5 సిబ్బంది మాత్రమే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం నుండి సమయానికి జీతాలు తీసుకుంటూ, సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. అదే విదంగా గురుకుల సెక్రెటరీ శరత్ కుమార్ కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ కు జరిగిన సంఘటనపై తెలియజేసినట్లు ఆయన తెలిపారు.