రాత్రికి రాత్రే పంటపొలంలో రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులు..
రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మిడిదొడ్డి మండలం మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు డిమాండ్..
సిద్దిపేట (విజయక్రాంతి): తన వ్యవసాయ పట్టా భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాలలో భూ సర్వే నంబర్ 76,77 గల మూడెకరాల భూమిలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి కనకయ్యలు రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్నాం కదా అన్న అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. తనను సంప్రదించకుండా తన వ్యవసాయ భూమిలో అక్రమంగా రోడ్డు నిర్మించిన కాంగ్రెస్ నాయకులపై సిద్దిపేట జిల్లా కలెక్టర్, సిద్దిపేట సిపి, దుబ్బాక సీఐ, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ తో పాటు, మిరుదొడ్డి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు తుమ్మల బాలరాజు, మాజీ కో ఆప్షన్ నెంబర్ ఎండి అహ్మద్ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.