24-03-2025 10:23:25 PM
దాడిని తీవ్రంగా ఖండించిన తెలంగాణ అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్..
సంగారెడ్డి (విజయక్రాంతి): పుల్కల్ మండల్ గొంగులూరు గ్రామంలో ఒక పరిశ్రమ యజమాని, సినీ నిర్మాత మురళీకృష్ణ అగైత్యాలు దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలంగాణ అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ ఆరోపించారు. శనివారం రోజున పల్లె సంజీవయ్య కుటుంబంపై కూడా దాడి చేశారని తెలిపారు. వారి కుమారుని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారాని ఆరోపించారు.
గతంలో కూడా మురళీకృష్ణపై మూడు హత్యయత్న కేసులు, నాలుగు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పుల్కల్ పోలీస్ స్టేషన్ లో నమోదు కావడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించి దళితులను, రైతులను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా భూములను కబ్జా చేసి వేధిస్తున్న మురళీకృష్ణపై పీడీ యాక్ట్ పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
అదే విధంగా జాతీయ ఎస్సీ కమిషన్ కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పల్లె సంజీవయ్య సంగారెడ్డికి వచ్చిన సందర్భంగా ఐబిలో వారిని కలిసి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పంబాల దుర్గాప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంచుల ప్రవీణ్, జిల్లా కార్యదర్శి మొగులయ్య, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, రిటైర్డ్ టీచర్ రాములు, జెల్ల సురేష్ తదితరులు ఉన్నారు.