28-02-2025 12:39:37 AM
మంచిర్యాల, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : నస్పూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్న బీజేపీ నాయకుడు కమలాకర్ రావుపై, బీజేపీ నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డిసిపి భాస్కర్ కు గురు వారం సాయంత్రం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్పూర్ ఎస్‌ఐ సుగుణాకర్ బిజెపి నాయకులపై చేయిచేసుకోవడం దారుణమని, ఎస్‌ఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ అశోక్ ఉన్న సమయంలో వారి సమక్షంలో కాంగ్రెస్ గూండాలు బీజేపీ కార్యకర్తల పై పోలీసుల లాఠీలు లాక్కొని దాడి చేయడం, రాళ్ల తో దాడి చేయడం వంటి ఘటనకు పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, పురుషోత్తం జాజు, జోగుల శ్రీదేవి, సత్రం రమేశ్, పిట్టల రవి పాల్గొన్నారు.