01-03-2025 06:46:37 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ఈ నెల 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున నస్పూర్ పోలింగ్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో బిజెపి నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులుకు శనివారం బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. నస్పూర్ ఎస్.ఐ సుగుణాకర్ బీజేపీ నాయకుడు కమలాకర్ పై చేయి చేసుకోవడంపై, కాంగ్రెస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య తదితరులు ఉన్నారు.