calender_icon.png 5 January, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సీఎంఆర్’ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

03-01-2025 02:16:25 AM

జేఎన్‌టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): సీఎంఆర్ కాలేజీ బాత్‌రూమ్‌లో విద్యార్థినుల వీడియోలు తీస్తున్నారని వచ్చిన ఆరోపణలపై పూర్తి విచారణ జరిపి.. ఘటనకు కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జేఎన్‌టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు రాహుల్‌నాయక్, గోపాల చందు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్‌రావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు.. సాయికుమార్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.