calender_icon.png 1 October, 2024 | 5:09 AM

ఆ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి

10-09-2024 04:08:38 AM

  1. నల్లగొండ హౌసింగ్ సొసైటీ సభ్యుల డిమాండ్
  2. గ్రీవెన్స్‌లో కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు
  3. ప్రభుత్వ ఆస్తిని కాజేశారని ఆరోపణ

నల్లగొండ, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్న జిల్లా కేం ద్రానికి చెందిన పలువురు జర్నలిస్టులపై చ ర్యలు తీసుకోవాలని నల్లగొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్ డేలో కలెక్టర్ సీ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశా రు. గత ప్రభుత్వ హయాంలో జీఓ 59ను అడ్డుపెట్టుకొని నాయకుల అండదండతో ఎనిమిది మంది జర్నలిస్టులు జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన రూ.10 కోట్ల భూమిని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నకిలీ మున్సిపల్ బిల్లులు, తప్పుడు ఇంటి నంబర్లు సృష్టించి అధికారులను మోసగించారని, నీటిపారుదల శాఖకు సంబంధం లేకుండానే రికార్డులు తారుమారు చేశారని ఆరోపించా రు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆందోళనతో అక్రమ క్రమబద్ధీకరణలను అధికారులు ర ద్దు చేశారని తెలిపారు. ఇతర జిల్లాల్లో ఇదే తరహ ఘటనలు జరిగినప్పుడు నిందితుల పై క్రిమినల్ కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. విచారణ జరిపి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

జర్నలిస్టులకు ఇళ ్లస్థలాలివ్వాలి 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు సోమవారం నల్లగొండ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేరు. నల్లగొండలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని ఇప్పటికే మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడింరు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో జర్నలిస్ట్‌లు దోసపాటి సత్యనారాయణ, కిరణ్‌రెడ్డి, అ శోక్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాము, మాధురి యాదగిరి, పంచలింగం, గోలి విజయ్‌కుమా ర్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.