calender_icon.png 23 December, 2024 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

23-12-2024 06:50:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ పై చర్య తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేనెంబర్ 267 లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పట్టా చేసుకుంటున్నారని వెంటనే అధికారులు జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్ ఎన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.