calender_icon.png 1 October, 2024 | 7:56 AM

యాజయాన్యంపై చర్యలు తీసుకోవాలి

01-10-2024 01:29:54 AM

శ్రీచైతన్య కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30: మాదాపూ ర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీచైతన్య కాలేజీ ఎదుట సోమవారం ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల క్రితం శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయి సుమారు 200 మం ది విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యం లో వారికి మెరుగైన వైద్యం అందించాలం టూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగా యి.

అయినా శ్రీ చైతన్య యాజమాన్యం స్పందించకపోవడంతో శనివారం విద్యార్థి సంఘాలు మరోసారి ఆందోళన బాటపట్టా యి. ఈ నేపథ్యంలో కాలేజీ సిబ్బంది విద్యా ర్థి సంఘాల ప్రతినిధులపై దాడికి తెగబడ్డా రు. ఈ ఘటనలో విద్యార్థి  సంఘాల నాయకులతో పాటు పలువురు జర్నలిస్టులు సైతం గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్ధుమణిగింది.

అయితే విద్యార్థులకు మెరుగైన వైద్యం మాత్రం అందలేదు. దీంతో సోమవారం రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పం దించిన జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వెంక య్య నాయక్ శ్రీచైతన్య కాలేజీ చేరుకుని విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాలేజీలో మెరుగైన వసతులు కల్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అయినప్పటికీ సోమవారం క్యాంపస్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.