19-02-2025 06:01:08 PM
గాంధారికి చెందిన బంజ నాగయ్య వారసులు...
కామారెడ్డి (విజయక్రాంతి): తమ వంశపారపర్యంగా వచ్చిన భూమిని కొందరు కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారని బంజ నాగయ్య వారసులు తెలిపారు. బుధవారం కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మా వంశపార్యం పరంగా వస్తున్న స్థలాన్ని అక్రమంగా వెంచర్ వేస్తుండగా బంజ నాగయ్య మనమలమైన బంజ శంకరప్ప, బంజా సంగప్ప, బంజ రాజప్పలం తమ స్థలం సర్వేనెంబర్ మూడులో ఇతరులు అక్రమంగా వెంచర్ చేస్తున్నారని అ వెంచర్ కు పర్మిషన్ ఉందా లేదా అని పర్మిషన్ లేకుంటే దాని నిలిపివేయాలని కార్యదర్శిని కోరగా మా పైనే పోలీస్ కేసు పెడతానని గాంధారి కార్యదర్శి నాగరాజు మమ్మల్ని బెదిరిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మా స్థలాన్ని ఇతరులు మా స్థలం కాదని అంటుండగా అట్టి స్థలంలో మేము గతంలో భావితవ్వుకొని పంటలు పండించుకున్నామని ఆ విషయం గ్రామస్తులకు తెలుసని ఇట్టి విషయాన్ని అధికారులను పలుకుబడి కలిగిన వ్యక్తులు తప్పుతోవ పట్టిస్తూ ఉండడంతో మాకు తెలిసిన వారితో ఆర్టిఐ ద్వారా సమాచారం కోరగా ఆ వెంచర్కు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని సదర్ కార్యదర్శి ఆర్టిఏ లేఖలో పేర్కొన్నారు అన్నారు. పర్మిషన్ లేని స్థలంలోని ప్లాట్లను ఎవరు కొనవద్దు అమ్మ వద్దని బోర్డు పెట్టాలని, హద్దురాలను తొలగించాలని కార్యదర్శిని కోరగా మాపైన పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు అన్నారు. మేము ప్రభుత్వ అధికారులను కోరేది ఒక్కటే మా స్థలంలో వీరు వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తే ఆ తర్వాత ఆ ఫ్లాట్లకోన్న పేద ప్రజలు ఇబ్బందుల గురి అవుతారని అలా జరగకుండా ఉండేందుకే ముందస్తుగా ప్రభుత్వ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు.
మాకు బుధవారం రోజున ఎంక్వైరీకి వస్తున్నాము మీరు రండి అని డిఎల్పిఓ డిపిఓ కి చెప్పాడని మాకు శనివారం తప్ప మరో రోజు డిఎల్పిఓ ఫోన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధారి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు మా ఒకరి స్థలంపైన ఇలా వ్యవహరించారా లేక ఇతర స్థలాలపై కూడా ఇలాగే వ్యవహరించారని అధికారులు సవివరంగా విచారణ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు. కార్యదర్శి నాగరాజ్ తప్పుడు అసెస్మెంట్ నెంబర్ లతో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడని తెలిపారు. మాకు జరుగుతున్న అన్యాయంపై బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్కు, జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. తప్పుడు అసెస్మెంట్ నెంబర్ ఇచ్చి దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.