బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, కాంగ్రెస్ లీగల్ సెల్ డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): జనగామ జిల్లా బార్ అసోసియేషన్‌కు చెంది న ఇద్దరు న్యాయవాదులపై దాడిచేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ డిమాండ్ చేశారు. పోలీసులు భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖం డించారు. న్యాయవాదులు అమృతరావు ఆయన భార్య కవితపై పోలీసులు దురుసుగా వ్యవహరించడంతోపాటు భౌతిక దా డి చేయడంపై జనగాం బార్ అసోసియేషన్ బుధవారం రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది.
దీనిపై బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ నరసింహారెడ్డి బార్ కౌన్సిల్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించి చట్టవిరుద్ధమైన ఈ చర్యను ఖండించారు. పోలీసు లపై చర్య తీసుకోవాలని కోరుతూ డీజీపీకి, ఆ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. హైకోర్టు బార్ అసోసియేషన్‌లో అత్యవసర జనరల్‌బాడీ సమావేశం నిర్వహించి ఘటనను ఖండించింది. బాధ్యులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.