ఆర్పిఐఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్...
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కైట్ ఫెస్టివల్ నిర్వహించిన నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(అతవాలే) రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ డిమాండ్ చేశారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కైట్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఆర్టీసీ అధికారులు అనుమతి ఇచ్చారా పర్మిషన్ ఇచ్చారా అని నిర్వాహకులను ఆయన ప్రశ్నించారు. గత డిసెంబర్ 31న చిన్న లేగ దూడ బస్టాండ్ ప్రాంగంలో ప్రమాదంకు గురై చనిపోడం జరిగిందని దానిని మరువక ముందే ప్రయాణ ప్రాంగణంలో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ చిన్నారులు, యువకులు, పతంగులు ఎగిరేసే క్రమంలో ఆర్టీసీ బస్సులులోనికి వచ్చి తిరిగి వెనకకు తిప్పుకునే క్రమంలో ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి పర్మిషన్ లేకుండా ప్రయాణ ప్రాంగణంలో పతంగుల పోటీలను నిర్వహించిన వారిపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.