calender_icon.png 18 March, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీపై చర్యలు తీసుకోవాలి

17-03-2025 06:43:50 PM

లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పోరిక ఈశ్వర్ సింగ్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఒక వర్గానికే కొమ్ముకాస్తూ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్న తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ రెడ్డిపై విచారణ జరిపించి ప్రభుత్వం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పోరిక ఈశ్వర్ సింగ్ డిమాండ్ చేశారు. పోలీసు గృహ నిర్మాణ సంస్థలో జరుగుతున్న అన్యాయాలపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అందులో భాగంగానే ఓ ఎస్సి సామాజిక వర్గానికి చెందిన డిఈ ఎలక్ట్రికల్ పై కక్షగట్టి బదిలీ చేశారని ఆరోపించారు. తక్షణమే అతనికి ఎలక్ట్రికల్ డ్యూటీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అర్హుడైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పక్కనపెట్టి తన చుట్టమైన జూనియర్ తులసి రెడ్డికి సూపరింటెడెంట్ ఆఫ్ ఇంజనీర్ పోస్ట్ కేటాయించారని అన్నారు. ఆంధ్రలో రిటైర్డ్ అయిన ఆర్.సీ కుమార్ అనే ఉద్యోగిని ఇక్కడ ఫైనాన్స్ అడ్వైజర్ గా ఔట్సోర్సింగ్ కింద నియమించి రూ.2.50 లక్షల జీతం ఇస్తున్నారని ఆరోపించారు. రూ.50, 60 వేలకే పని చేసే తెలంగాణ వాళ్ళు ఉన్నప్పటికీ అతనికి ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. అతన్ని విధుల్లోంచి తొలిగించి, తెలంగాణ వాళ్ళని ఈ పోస్ట్ కు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను వేధిస్తున్న ఇతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని జీతం మొత్తం రికవరీ చేయాలన్నారు.

అలాగే ఆంధ్రకు చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగికి లీగల్ అడ్వైజర్ ఉద్యోగం ఇచ్చి రూ.1.50 లక్షల జీతం ఇస్తున్నారన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా స్వాధీనం చైర్మన్ ఛాంబర్ ను ఎండీ తిరిగి అప్పజెప్పాలన్నారు. ప్రస్తుతం తులసి రెడ్డి కొనసాగుతున్న ఐదు పోస్టులను తొలగించి ఒక పోస్టుకే పరిమితం చేయాలన్నారు. ఎస్టీ మహిళ ఉద్యోగిణి కక్ష కట్టి రేంజ్ డివిజన్ కు ట్రాన్స్ఫర్ చేశారని... మరల ఆమెను తిరిగి హెడ్ ఆఫీస్ కు తీసుకురావాలని కోరారు. సీనియార్టీ కమిటీ రిపోర్టు రాకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని బంజారా సంఘాలు ఏకమై పెద్దెత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.