calender_icon.png 4 April, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలేకరిపై హత్యాయత్నం చేసిన మాఫియాపై చర్యలు తీసుకోవాలి

27-03-2025 07:50:06 PM

డిఎస్పికి వినతిపత్రం సమర్పించిన విలేకరులు..

అందోల్: అక్రమ బియ్యం మాఫియా జోగిపేట సాక్షి మీడియా విలేఖరిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ దుర్ఘటన జర్నలిజంపై గొడ్డలి వేటని టియూడబ్ల్యూజె (హెచ్) ఉమ్మడి మెదక్ జిల్లా విష్ణువర్ధన్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జిల్లా యోగానంద రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి సత్తయ్యకు అందోల్ జర్నలిస్టుపై జరిగిన హత్యాయత్నం చేసిన నిధులపై చర్యలు తీసుకోవాలని ఆందోల్ జర్నలిస్టుల బృందంతో వినతిపత్రం అందజేశారు. 

గురువారం ఆందోల్ మండలం సంగుపేట శివారులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా బోలెరా వాహనంలో యదేచ్చగా తరలిస్తున్న దృశ్యాన్ని ఆందోల్ సాక్షి విలేఖరి చిత్రీకరిస్తుండగా అక్కడికి బియ్యం మాఫియా గుండాలు దానిష్ పటేల్, ఎండి షకిల్, పుట్నాల ఆశం, ఇలియాస్ అనే వ్యక్తులు కార్లో వచ్చి అందులో ఉన్న లాఠీలతో విలేకరిపై మూకుమ్మడి దాడి చేశారని, విచక్షణారహితంగా కొట్టడంతో విలేకరి ఎడమ చెయ్యి విరిగిపోయిందని, ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తూ గుండాయిజం ఎలా ఇస్తున్నారని, వారిపై అత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విలేకరుల బృందం వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

దీనిపై డిఎస్పి సానుకూలంగా స్పందించి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోగిపేట విలేకరులు పడిగేల భగత్, హెచ్ ప్రదీప్ గౌడ్, సంజీవ్ కుమార్, కాశీనాథ్, శివ రత్నం, అనిల్ చారి, దిగంబర్, సందీప్ కుమార్, రాజు, మధు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఆందోల్ మల్లేశం, దళిత సంఘాల నాయకులు జంగం మహేష్ మొగులయ్య కరుణాకర్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.