calender_icon.png 15 January, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

23-09-2024 12:25:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెరువులను, నాళాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చుంచుపల్లి మండలంలోని చింతలచెరువు ఆక్రమణకు గురైన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. తక్షణమే చెరువు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుజాతనగర్ మండలంలోని సింగబూపాలెం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. చెరువులు, నాళాల కబ్జా తోనే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం అతలాకుతలమై తీవ్ర నష్టం వాటి ల్లిందని గుర్తు చేశారు.