నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని వాలేగం గ్రామానికి చెందిన దళిత మహిళలు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్య తీసుకొని దాన్ని దళితులకు పంచాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన 50 మంది మహిళలు సమస్యను కలెక్టర్ గురించి తమకు న్యాయం చేయాలని కోరుతూ విన్నవించారు. అనంతరం ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన సద్ది అన్నంను కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని తిన్నారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో తీవ్ర చర్చ జరిగింది.