calender_icon.png 28 April, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓదెల-2 చిత్ర దర్శక నిర్మాతలపై చర్యలు తీసుకోవాలి

26-04-2025 12:00:00 AM

నవోదయ పార్టీ అధ్యక్షులు శివశంకర్ పటేల్

ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన ఓదెల-2 సిని మాలో తమ కులాన్ని ఉద్దేశించి కించపరిచే విధంగా డైలాగులు రాసి చిత్రీకరించిన దర్శకుడు అశోక్ తేజ, నిర్మాత డి. మధులపై ప్ర భుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నవోదయ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ పటేల్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు  శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక నాయకుడు వంశరాజ్ (పిచ్చకుంట్ల) కులస్తుడు ఇ.మల్లేష్‌తో కలిసి ఆయన మా ట్లాడారు. బీసీ-ఏ సీరియల్ నెం.18లో రెడ్లకు ఆశ్రతకులమైన వంశరాజ్ కులాన్ని సినిమాలో ఒక తిట్టుగా వాడి ఆ కులస్తుల మనో భావాలు దెబ్బతీశారని అన్నారు.

ఈ విషయంపై బీసీ కమిషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ  చట్టపరమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఆ కులాన్ని కించపరిచి సమాజంలో విలువ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో జాప్యం చేస్తున్న పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.