calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పనులు కల్పించని సిబ్బందిపై చర్య తీసుకోవాలి

11-03-2025 07:37:07 PM

వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య..

మునుగోడు (విజయక్రాంతి): ఉపాధి పనులను ప్రారంభించి అన్ని గ్రామాలలో కూలీలకు, పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య డిమాండ్ చేశారు. మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులను ఎక్కువ గ్రామాల్లో కల్పించడం లేదని ప్రధానంగా ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వలన పనులు దొరకక అనేకమంది పేదలు వలస బాట పడుతున్నారని అన్నారు.

వలసలు నివారించడానికి వచ్చిన ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం ఫీల్డ్ అసిస్టెంట్ పరమేష్ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ అధ్యక్ష కార్యదర్శులు సింగపంగా ఎల్లయ్య కట్టా ఎల్లమ్మ సంఘ నాయకులు పగిళ్ల మల్లేష్ సింగపంగా సుగుణమ్మ చిలుకూరి చిన్న యాదమ్మ పగిలిన చేకూరి కావ్య పులకరం కనకమ్మ నకరికంటి మొత్తం మా తదితరులు పాల్గొన్నారు.