calender_icon.png 29 April, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి

18-04-2025 01:34:49 AM

సూర్యాపేట, ఏప్రిల్ 17: ఎలాంటి అనుమతులు లేకుండా ముందస్తు అడ్మిషన్లను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పి.డి.ఎస్. యు జిల్లా అధ్యక్షులు పూల్లూరి సింహాద్రి  డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య ప్రైవేట్ విద్యాసంస్థల పేరుతో బోర్డ్ లను  ఏర్పాటు చేసి, పట్టణ, గ్రామాలలో ఆయా ప్రాంతా ల్లోని విద్యార్థులను అడ్మిషన్ల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా  దరఖా స్తులు స్వీకరిస్తున్నారని, ఎటువంటి అకామి డేషన్ చూపించకుండా బ్రోచర్లో ఫీజులను మెన్షన్ చేయకుండా తల్లిదండ్రులను వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లక్ష నుం చి లక్షన్నర వరకు ఫీజు వసూలుకు పూను కుంటున్నారన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే తమ సంస్థ ఆధ్వ ర్యంలో అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సమస్యలపై ప్రత్యేక ఆందోళనలు చేపడతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు, మహేష్,నవీన్, వినయ్, శ్రీధర్,పవన్ పాల్గొన్నారు.