calender_icon.png 25 October, 2024 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల అమ్మేవారిపై చర్య తీసుకోవాలి

14-09-2024 11:34:16 AM

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్మేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సేవ్ మున్సిపాలిటీ సేవ్ కొత్తగూడెం కన్వీనర్ జలాల్ డిమాండ్ చేశారు. ప్లాస్టిక్ వల్ల జీవకోటి సమస్తానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. క్యాన్సర్ వాది రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టదిట్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో అడ్డు అదుపు లేకుండా ప్లాస్టిక్ వస్తువులు విక్రయాలు వినియోగం సాగుతుందని, వాటిని అదుపు చేయాల్సిన మున్సిపల్ అధికారులు నిమ్మకు నేరెట్టినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వ్యాపారస్తులు ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాన్ని నిలిపివేయాలని, వినియోగదారులు ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ వాడకాలపై ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేశారు