calender_icon.png 9 January, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ పి రజితపై చర్యలు తీసుకోవాలి

31-12-2024 04:30:02 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు పేరుతో రుణం తీసుకున్న ఆర్పి ఎం.రజితపై చర్యలు తీసుకోవాలని మహిళా సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. 2019లో గ్రూపు సభ్యురాలు బొడ్డు లక్ష్మీ చనిపోగా ఆమె పేరుతో ఆర్పీ రజిత 60 వేల బ్యాంకు రుణం పొందిందని ఆరోపించారు. ఈ విషయంలో నిలదీస్తే తమ గ్రూపుకు మంజూరైన పదిలక్షల రూపాయల రుణం రాకుండా అడ్డుపడుతుందని ఆరోపించారు. అంతేగాకుండా తమను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్పి రజితపై పోలీస్ కమిషనర్, కలెక్టర్ కు, బెల్లంపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన ఫలితం గంగారాం నగర్ బస్తీలో ఎస్ ఎల్ ఎఫ్ ఉండడం తమకు ఇబ్బందిగా మారిందన్నారు. 40 మంది సభ్యులతో కొత్త ఎస్ ఎన్ ఎఫ్ ఏర్పాటు చేయాలని అధికారులకు దరఖాస్తులు చేసుకున్న ఆర్పి రజిత అడ్డు తగులుతుందని చెప్పారు. అధికారులు మరణించిన సభ్యురాలి పేరిట రుణం పొందిన ఆర్పి రజితపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సభ్యులు బి.శ్రావణి, ఎం.శీలావతి, పి.మానస, బి. సరస్వతి, రమ్య తదితరులు పాల్గొన్నారు.