calender_icon.png 10 January, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియాంక ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి

07-08-2024 12:24:54 AM

  1. కావ్య కుటుంబ సభ్యుల డిమాండ్ 
  2. ఆసుపత్రిని సీజ్ చేసిన వైద్యాధికారులు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రియాంక ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కావ్య కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ధర్నా చేశారు. ప్రియాంక ఆసుపత్రి వైద్యురాలు ప్రియాంక ఆసుపత్రిలో అందుబాటులో లేకపోయినా తన భర్త సునిల్‌కు వీడియో కాల్ లో సూచనలు చేస్తూ వైద్యం చేయించిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే గర్భిణి అయి న కావ్యకు సిజేరియన్ చేసిన అనంతరం కట్లు వేసే క్రమంలో గర్భసంచికి కత్తిపోట్లు పడ్డాయని ఆరోపించారు.

దీంతో గర్భసంచి ని తొలగించారని, అధిక రక్తస్రావంతో బాలింత మృతి చెందినట్లు ఆరోపించారు. ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా జిల్లా వైద్యాధికారుల బృం దం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో ఆసుపత్రి వెనక నుంచి వైద్యురాలి భర్త పరారయ్యాడు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటదాసు తెలిపారు.