22-04-2025 08:32:11 PM
డీఎస్పీకి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ వినతి..
కాటారం (విజయక్రాంతి): చెరువులలో మట్టి దోపిడి చేస్తున్న అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి(DSP Gaddam Rammohan Reddy)కి వినతి పత్రం అందజేశారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆతుకూరి శ్రీకాంత్ మాట్లాడుతూ... మండలంలోని పోతుల వాయి శివారు నల్లగుంట, విలాసాగర్, శంకరంపల్లి, దేవరంపల్లి, పరికిపల్లి చెరువులలో మట్టిని యదేచ్చగా తరలిస్తూ పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. మట్టిని తరలిస్తున్న అక్రమార్కులపై తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం 1905 సెక్షన్ 5, 6, 7 వాల్టా చట్టం 2001 సెక్షన్ 3, 4, 6 పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సెక్షన్ 15 ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆయనతో పాటు బీఎస్పీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బొడ్డు రాజ్ కుమార్ పాల్గొన్నారు.