04-03-2025 07:14:01 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలు పాటించని పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఏవో మధుకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా యజమాన్యాలు పెట్రోల్ పంపులు నడుపుతున్నారని ఆరోపించారు. సరైన సౌకర్యాలు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని మినరల్ వాటర్, ఫ్రీ ఎర్, మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
సంబంధిత అధికారులు సైతం తనిఖీలు నిర్వహించడం లేదని దీంతో బంకు యజమాన్యాలు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంకులను సందర్శించడం జరిగిందని అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకానంద్, గొడిసెల కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టిఏజిఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్, టిఎజిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు.