29-04-2025 12:13:41 AM
ఎస్పీ రోహిత్ రాజ్
దమ్మపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
అశ్వరావుపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) కోడిపందాలు పేకాట, బెట్టింగులు వంటి అసాంఘిక కార్యకల పాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పి రోహిత్ రాజు పోలీస్ సిబ్బం దిని ఆదేశించారు. సోమవారం ఆయన దమ్మపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీ స్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోడిపందాలు,పేకాట,బెట్టింగు లు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు..అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కద లికలపై నిఘా పెంచి దొంగతనాల కట్టడికి కృషి చేయాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణ చర్యలను చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసు ల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. .సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.ఈ కార్య క్రమంలో అశ్వరావుపేట సిఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్త్స్ర సాయి కిషోర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.