మునిపల్లి: గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మునిపల్లి మండల పరిధిలోని ఖమ్మం పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం పల్లి గ్రామస్తులు సుభాష్ మంగళవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, పంచాయతీరాజ్ కమిషనర్ కు కలిసి అందించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ... బడిబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మంపల్లి ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గొడ నిర్మాణం పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబిలు తయారు చేయడంతో బిల్లులు సైతం గ్రామ పంచాయతీ ఖాతాలో జమయ్యాయి. పంచాయతీ కథలో జమైన బిల్లు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. మంజరైన బిల్లును చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఖమ్మంపల్లి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.