calender_icon.png 17 March, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుట్‌పాత్‌ల ఆక్రమన పట్టని అధికారులపై చర్యలు తీసుకోవాలి

17-03-2025 02:11:10 AM

 సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

 కరీంనగర్ క్రైం, మార్చి 16 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా ఫుట్ పాత్ లను వ్యాపారులు ఆక్రమిస్తున్న మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు  ఒక ప్రకటనలో  విమర్శించారు.

కరీంనగర్ నగరంలో కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో నగరమంతా సైడ్ ట్రాక్స్, ఫుడ్ పాత్ లు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే అవి పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయని, అక్రమణాలకు గురవుతున్న వాటిని కాపాడడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు.

కరీంనగర్ నగరంలో మున్సిపల్ అధికారులు అలసత్వం నిర్లక్ష్యం వల్ల అక్రమాలు  పెరిగిపోతున్నాయని,  వీరిని ఏమాత్రం అరికట్టకపోవడం విచిత్రంగా ఉందన్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు రోడ్లను ఆక్రమించడం ద్వారా వాహనాల పార్కింగ్, నడవడం తీవ్ర ఇబ్బంది జరుగుతుందని తెలిపారు. వీటిపై ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని  హెచ్చరించారు.