calender_icon.png 4 February, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌరహక్కుల దినోత్సవానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలి

04-02-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్‌కు ప్రజా సంఘాల ఫిర్యాదు 

సిరిసిల్ల, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): అంటరానితనం నిర్మూలన ఎస్సీ, ఎస్టీ అత్యాచారములను నిరోధించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి పౌర హక్కుల దినోత్సవానికి డుమ్మా కొట్టిన అధికారుల  పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  కొన్ని సంవత్సరాలుగా ప్రతినెల 30న ఏర్పాటు చేస్తున్నటువంటి పౌర హక్కుల దినోత్సవం అధికారులు ఎవరూ హాజరవుతలేరని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు చేరేలా చేసి అంటరాని తనం, కులవివక్ష వంటివి ఎలా దూరం చేయాలి,కులాల మధ్య సమన్వయం చేసేలా ,వారిలో చైతన్యం చేయాల్సిన అధికారులే ఇలా డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నించారు.

అలాగే ఎస్సి, ఎస్టీ,విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా ఎవరు హాజరు అవుతలేరని ఆరోపించారు.అలాంటి వారిని ఎందుకు కమిటీ లో తిసు కున్నారన్నారు,వెంటే ఆ కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికైన పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రగడ్బంధిగా అమలు చేసి నిర్లక్ష్య రాసులైనా దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక్కడ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్, లంబాడ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ , బహుజన సేన జిల్లా అధ్యక్షులు జింక శ్రీధర్, అంబేద్కర్ సంఘం యువజన సంఘం యూత్ అధ్యక్షులు మాసం సుమన్, నాయకులు నరేష్ ,స్వామి, సురేష్ పాల్గొన్నారు.