calender_icon.png 28 March, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

25-03-2025 04:56:42 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఈనెల 21న మంచిర్యాలలోని శ్రీశ్రీ నగర్ లో నివాసముంటున్న నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు దుర్గం స్వామి ఇంటికి తాళం వేసి అతని కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్ లపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించేలా చర్యలు చేపట్టాలని నేతకాని మహర్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గోమాస శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ... మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు నిర్వహించకుండా ఇంటి పన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టడం సరైంది కాదని అన్నారు.

మానవత్వ దృక్పథంతో నిరుపేదల స్థితిగతులు అర్థం చేసుకొని ఇంటి పనుల చెల్లింపుకు వారికి గడువు ఇవ్వాలని కోరారు. మహిళలు, చిన్నపిల్లలను ఇంట్లో పెట్టి బంధించి తాళం వేయడం అమానుషమైన చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. మరో ఇంట్లో భార్యాభర్తలను బయటకు వెళ్లగొట్టి తాళం వేయడం బాధాకరమన్నారు. దళిత నాయకులపై ఇంతటి దౌర్జన్యం కొనసాగిస్తే సామాన్య దళితుల పరిస్థితి మరే రకంగా ఉంటుందో అర్థం అర్థం చేసుకోవాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గట్టు శివలింగం మాట్లాడుతూ... నేతకాని మహర్ రాష్ట్ర నాయకులు దుర్గం స్వామి 2005 సంవత్సరంలో నల్ల కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు.

మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్వామి ఇంటిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం అనైతిక చర్యగా అభివర్ణించారు. దళితుల పేదరికంపై దెబ్బ కొడితే అధికారులపై తాము ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఆగిడి భీమరాజు, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దుర్గం భాను ప్రసాద్, తాండూరు మండల అధ్యక్షులు దుర్గం మహేందర్, బెల్లంపల్లి మండల కార్యదర్శి దుగుట విలాస్ తదితరులు పాల్గొన్నారు.