calender_icon.png 11 January, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి

11-12-2024 11:04:00 PM

జర్నలిస్టుల డిమాండ్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. హైదరాబాదులో మంచు కుటుంబంలో చెలరేగిన వివాదం కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడికి దిగడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. అతనిపై కేసు నమోదు చేయాలని బుధవారం ఆసిఫాబాద్ సిఐ రవీందర్ కు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.