28-08-2024 01:14:46 AM
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన మల్లారెడ్డి, అనురాగ్ యూనివర్సిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా గుబు లు పుట్టిస్తోందన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించాలని హైడ్రా కమిషనర్‌ను కోరారు. సమావేశంలో శ్యామ్ రావు, అనిల్, మనీశ్, తరుణ్‌రాజ్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.