బీఆర్ఎస్ చెన్నూర్ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్...
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అనుచరులు చేస్తున్న ఇసుక దందాలపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు. చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో గురువారం పర్యటించి గ్రామంలోని సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నెలకు రెండు మూడు సార్లు చుట్టపు చూపుగా వచ్చి నాయకులు కార్యకర్తలు అక్రమాలు చేయరని ఒకవేళ చేస్తే పోలీస్ లు చర్యలు తీసుకుంటారని ప్రగల్భాలు పలుకుటున్నారని ఆయన విమర్శించారు.
అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుందని దీనిలో భాగంగా ఇసుక లారీ వెళ్ళే సమయంలో కల్వర్టు దెబ్బ తిందని అదే కల్వర్టు పటిష్టంగా ఉందని లేకుంటే కల్వర్టు పక్కనే నివాసం ఉంటున్న వృద్ధ మహిళ ఇంటిపై పడి ప్రాణ నష్టం జరిగేదనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ ఏడీ, పీవో జిల్లా కలెక్టర్ లు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక దందా చేస్తున్న ఎమ్మెల్యే అనుచరుడు రమేష్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మంత్రి బాపు, మాజీ జడ్పీటిసి మోతే తిరుపతి, మాజీ ఏఎంసి చైర్మెన్ మల్లెల దామోదర్ రెడ్డి, రత్న సమ్మిరెడ్డి, ఏలేశ్వరం నరసింహ చారి, ఐత సురేష్ రెడ్డి, ఇనగంటి వెంకటేశ్వర రావు, ఇంగిలి రవి వెంకటస్వామిలు పాల్గొన్నారు.