మీర్‌పేట్ కార్పొరేషన్ ఎదుట మహిళా కార్పొరేటర్ నిరసన
మహేశ్వరం, డిసెంబర్ 6: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనప్రియ మహానగర్‌లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని 31వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మిఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయం గేటు వద్ద ఆమె బైఠాయించి నిరసన తెలిపారు. అక్రమ నిర్మాణాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించడం లేదని ఆరోపించారు. విషయం తెలసుకున్న ఉన్నతాధికారులు.. విజయలక్ష్మితో మాట్లాడి ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించారు. త్వరలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.