గురుకులంలో అనవసరంగా విద్యార్థిపై చేయి చేసుకున్న ప్రిన్సిపాల్..
తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులు నలుమూలాల నుండి గురుకులం వసతి గృహంలో ఉండి, విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వస్తున్న తరుణంలో సదరు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ప్రేమతో ఉండి మమేకమై విద్యాబుద్ధులు నేర్పవలసి ఉండగా అ కారణంగా ఓ విద్యార్థి పై, బెత్తముతో చేతులు వీపులపై దండించిన ప్రిన్సిపాల్ సతీష్ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కళాశాలలో 9వ తరగతి చదువుతున్న ఉదయ్ అనే విద్యార్థిపై, గురుకుల ఇంచార్జి ప్రిన్సిపల్ సతీష్ అకారణంగా చేతులపై దండించడం జరిగింది. జరిగిన సంఘటన తమ తల్లిదండ్రులకు విద్యార్థి తెలియపరచగా, హుటాహుటిన తల్లిదండ్రులు వచ్చి అతనిపై ఘర్షణకు దిగారు. దీనితో ఇంచార్జి ప్రిన్సిపాల్ సతీష్ చేసేదేమీ లేక తల్లిదండ్రులకు క్షమాపణ కోరాడు. ఏది ఏమైనా ప్రిన్సిపాల్ పోకడతో ఒకపక్క ఉపాధ్యాయులు, మరొక పక్క విద్యార్థులు కష్టాలు చవిచూస్తున్నారు, జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా గురుకులం ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సతీష్ పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.