calender_icon.png 13 February, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ రామభక్తులపై చర్యలు తీసుకోవాలి

13-02-2025 12:00:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు 

చేవెళ్ల, ఫిబ్రవరి 12: నిజమైన రామభక్తుడైన చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన కల్తీ రామ భక్తులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చిలుకూరులో రంగరాజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ సకల మతాలకు నిలయమని, ఇలాంటి దేశంలో రాముడి పేరుతో దౌర్జన్యాలు చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని విమర్శించారు. రాముడు అందరి వాడని, కొందరు మతవాదులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రామరాజ్యం అంటే దౌర్జన్యాలు కాదని, అందరినీ సమానంగా చూడడమేనని హితవు పలికారు. రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభు లింగం, మండలాల కార్యదర్శులు శ్రీనివాస్, సత్తిరెడ్డి, సుధీర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, బీకేఎం యూ జిల్లా అధ్యక్షుడు జూకంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.