calender_icon.png 4 March, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎంపై చర్యలు తీసుకోవాలి

04-03-2025 12:44:39 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిసిన కార్మికులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్న డిఎం పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఎమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి కార్మికులతో కలిసి సోమవారం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిశారు.

ఆసిఫాబాద్ డిపోలో పనిచేస్తున్న కార్మికులపై పని భారం పెంచి వేధింపులకు గురి చేస్తున్నారని తమ గోడును మంత్రికి వెళ్ళబోసుకున్నారు. హైదరాబాద్ సర్వీసుల మూడు రోజుల పని దినాలను రెండు రోజులకు కుదించే కుట్ర చేస్తున్నారని తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పనిచేయని బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించి కార్మికులపై తప్పుడు నివేదికలు తయారుచేసి సస్పెండ్ చేయడం, సర్వీస్ నుండి రిమూవ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్‌ఎం సోలేమాన్, డి ఎం విశ్వనాథ్ వేధింపులు ఆపాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కె ఎస్ రావు ,కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.