22-04-2025 12:06:32 AM
సూర్యాపేట, ఏప్రిల్ 21: జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తూ, ఆ సంస్థలు ఇచ్చే తాయిలాలకు అలవాటు పడిన జిల్లా విద్యాశాఖాధికారి పై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ ఆరోపించారు. సోమవారం డిఈఓ పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు విద్యాసంస్థలను కట్టడి చేయడం లేదని, అనుమతి లేకుండా విద్యాసంస్థలను నడుతూ, విద్యార్థుల పై అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు పలుమార్లు విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లిన తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
తక్షణమే కలెక్టర్ స్పందించి డిఈఓ పై చర్యలు తీసుకొని టెర్మినేట్ చేయాలన్నారు. దీంతో పాటు అనుమతులు లేకుండా ముందస్తుగా అడ్మిషన్స్ తీసుకుంటున్న విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలన్నారు.