calender_icon.png 20 April, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి

19-04-2025 02:00:59 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18 ( విజయ  క్రాంతి ): దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నల్లగొండ డీఎస్పీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.. నాగం వర్షిత్ రెడ్డి  ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్  రెడ్డి  మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా భారత దేశ ప్రధానమంత్రిగా ఎన్నికై దేశ సేవలు నిర్వహిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  దిష్టిబొమ్మ నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంత్రి కోమటిరెడ్డి అనుచరులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అబ్బగోని  రమేష్ తదితర అనుచరులతోటి దేశ ప్రధాని దిష్టిబొమ్మ తగలబెట్టే దుశ్చర్యకు పాల్పడ్డ అటువంటి వీరిపై వెంబటే చట్టపరమైన చర్య తీసుకోవాలని  డిమాండ్ చేశారు..

ప్రజలను మోసగించి అడ్డదారులతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మెడిసి పడటం తగదన్నారు. నేషనల్ హెరాల్ కేసు ఈడి విచారణ చేస్తుందని సోనియా గాంధీనీ, రాహుల్ గాంధీని పై ఈడి కేసులు పెడితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా  కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శిలు పోతేపాక లింగస్వామి, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, రెండవ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, రాష్ట్ర ఫిషరింగ్ కో కన్వీనర్ రమణ, మంగళపల్లి కిషన్,కొత్తపల్లి ప్రమోద్, దాసరి వెంకన్న, ఏం రెడ్డి బిక్షం రెడ్డి, లకుడాపురం వెంకన్న, పిండి పాపిరెడ్డి, భీపంగి జగ్జీవన్, టంగుటూరి శ్యామ్, గోపి, తదితరులు పాల్గొన్నారు.