- ఇండ్లు, రుణాలు ఇప్పిస్తామని రూ.కోట్లలో మోసం
- రాష్ట్ర కార్యాలయ ముట్టడికి బాధితుల యత్నం
ముషీరాబాద్, డిసెంబర్ 28 : స్వచ్ఛంద సంస్థల ముసుగులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ పేదలతో పాటు సొం త పార్టీ కార్యకర్తలను మోసం చేశాడంటూ ఆరోపిస్తూ బాధితులు శనివారం నగరంలోని లక్డీకాపూల్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయ ముట్టడికి యత్నించారు. బీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభాకర్, మాల్యవి కరుణోదయ స్వచ్ఛంద సంస్థల నిర్వహకురాలు కొండా కృష్ణమ్మ..
గ్రామాల్లో ఇల్లు కట్టిస్తానని, నాబార్డు నుంచి వివిధ పథకాల సబ్సిడీతో పాటు డెయిరీ, వ్యవసాయ, చేపల పెంపకం వంటి రుణాలు ఇప్పిస్తానని, మార్టిజన్ మనీ, ఖర్చుల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తమను మోసం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పేద ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.
రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఇండ్లు కట్టించలేదని, రుణాలు మం చేయించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వలేదన్నారు. డబ్బులు ఆడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. బాధితులు పల్లేటి రవీందర్, గుర్రాల నాగయ్య, ముడిగి భిక్షపతి, నాతూరామ్, గ్యార రంగయ్య, పూదరి నర్సింహా, జిల్లా రవి, వంగ కృష్ణయ్య, అగ్ణాలపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.