calender_icon.png 8 October, 2024 | 7:41 PM

బోగస్ స్వచ్చంద సంస్థలపై చర్యలు తీసుకోవాలి

08-10-2024 05:16:18 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మబలికి నకిలీ నియామక పత్రాలు అందించి బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తున్న బోగ స్వచ్ఛంద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎం.సీ.పీ. ఐ.(యు) జిల్లా కమిటీ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్కూల్ లిటరసీ పథకం కింద విద్యాంజలి 2.0 అనే పోర్టల్ ను తీసుకు వచ్చి వాలంటీర్ల నియమకాలు చేపడుతున్న క్రమంలో భోగస్ స్వచ్చంద సంస్థలు నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మబలికి వారికి నకిలీ నియామక పత్రాలను అందజేస్తున్నాయని ఆరోపించారు.

బెల్లంపల్లిలో ఏఎన్ఎం ఉద్యోగాలు పెట్టిస్తామని కూడా నిరుద్యోగ యువతుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు వారి ఆరోపించారు. నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన బోగస్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భోగస్ స్వచ్ఛంద సంస్థల పై నిఘా ఉంచి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆరెపల్లి రమేష్ పెట్టo అరవింద్ లు పాల్గొన్నారు.