ముషీరాబాద్, జనవరి 28: హుస్సేన్ సాగర్‌లో జరిగిన బోటు ప్రమాదానికి కారణమైన భారతమాత ఫౌండేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మా ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్‌లో మంగళవారం వీహెచ్ మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన ప్రమాదం మృతిచెందిన అజయ్..
తండ్రి నాగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారని, ఆ కుటుంబానికి కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి రూ.2 కోట్ల పరిహారంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని,అలాగే ప్రమాదంలో గాయపడిన సా గణపతికి కూడా పరిహారం చెల్లించాలని అన్నారు. పుష్ప సినిమా హీరోపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుందో అదే తరహాలో భారతమాత ఫౌండేషన్‌పై కూడా చర్యలు తీసుకో డిమాం చేశారు.