14-04-2025 06:23:20 PM
మాలకుల సంఘం అధ్యక్షులు పెండెం రాజు...
బెల్ట్ షాపులు నిర్మూలించాలని మహిళల నిరసన..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని మహాలక్ష్మి వాడలో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మాల కుల సంఘం అధ్యక్షులు పెండెం రాజు డిమాండ్ చేశారు. సోమవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మాల కుల సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి వాడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
అనంతరం ఎక్స్చేంజ్ అధికారులకు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మాల కుల సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాల కుల సంఘం అధ్యక్షుడు పెండం రాజు మాట్లాడుతూ... బెల్టు షాపుల వలన మగవారు తాగుడుకు బానిసలై మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బెల్ట్ షాపుల పైన చర్యలు చేపట్టి నిరుపేద కుటుంబాలను కాపాడాలని కోరారు. బెల్ట్ షాపుల ప్రాణనాష్టం, ఆస్తి నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాల కుల సంఘం ప్రధాన కార్యదర్శి గరిసె రవీందర్, గౌరవ అధ్యక్షులు గుంపుల మల్లయ్య , అధికార ప్రతినిధి మినుముల శాంతి కుమార్, కోశాధికారి మినుముల వేణు, ఉపాధ్యక్షులు తొగరి అశోక్, బన్న శీను, పెండెం శాంతయ్య, గుంపుల శీను, మామిడి తిరుపతి, కార్యవర్గ సభ్యులు సట్టా రాజ్ కుమార్, గుంపుల కిరణ్, రాపల్లి కృష్ణ, గౌరవ సలహాదారులు తొగరి ప్రభాకర్ , గుంపుల మల్లయ్య,పెండెం పెద్ద లింగయ్య, కోళ్ల బాపు, బొల్లం మనోహర్,రాపల్లి సత్యనారాయణ, రాపల్లి భగవాన్ దాస్, పెండెం పోశం ,సభ్యులు మినుముల శీను,పెండెం సర్దార్, పెండెం శ్రావణ్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.